భారత్ లో ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ విడుదల

SMTV Desk 2019-01-10 17:27:25  Australia tour of India, Hyderabad, Vishakapatnam, 24th Feburary, 13th March

హైదరాబాద్, జనవరి, 10: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా లో జరిగే వన్డే సిరీస్ కు సిద్ధంగా ఉందని తెలిసిన విషయం. ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ తో సిరీస్ ఉంటుంది. ఈ రెండు సిరీస్ తర్వాత ఫిబ్రవరిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ షెడ్యూల్‌‌ని బీసీసీఐ విడుదల చేసింది. 24 ఫిబ్రవరి నుండి 13 మార్చ్ వరకు నివహించే టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడనున్నారు. రెండు టీ20లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.00 గంటలకు జరుగనుండగా, వన్డేలు మాత్రం మధ్యాహ్నాం 1:30 గంటలకు జరగనున్నాయి.

రెండు టీ20 సిరీస్ లో మొదటిడి 24 ఫిబ్రవరి రోజు బెంగళూరులో ఉంటుంది, 2వ మ్యాచ్ 27 ఫిబ్రవరి రోజు విశాఖపట్నం లో జరగనుంది.

ఐదు వన్డేల సిరిస్‌లో తొలి వన్డే మార్చి 2న హైదరాబాద్‌లో, రెండో వన్డే 5వ తేదీన నాగ్‌పూర్‌లో, మూడో వన్డే 8వ తేదీన రాంచీలో, నాలుగో వన్డే 10వ తేదీన మొహాలీలో, ఐదో వన్డేలో 13వ తేదీన ఢిల్లీలో జరగనుంది.