అప్పుడే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది..!!

SMTV Desk 2019-01-10 14:58:05  EBC Resrevations, Central government, MP Kavitha, TRS, TDP, BJP, Narendra modi

హైదరాబాద్, జనవరి 10: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈబీసీ బిల్లును తెలుగు రాష్ట్రాల్లో గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుకు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల్లో తెరాస తన పూర్తి మద్దతు తెలుపగా తెదేపా మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేఖిస్తుంది. కాగా ఈ ఈబీసీ రిజర్వేషన్ల పై తెరాస ఎంపీ కవిత స్పందించారు. ఓ వైపు ఈ బిల్లు వేగంగా ముందుకు కదిలి ఉభయ సభల ఆమోదం పొందడాన్ని ప్రశంసిస్తూనే మహిళా బిల్లుపై కేంద్రాన్ని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఈబిసి బిల్లు మాదిరిగా వేగంగా ఉభయసభల్లో పాస్ అయితే బావుంటుందన్నారు.

అప్పుడే దేశం నిజంగా అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. మహిళా బిల్లు సాధన కోసం మరిన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఈబిసి రిజర్వేషన్లను స్వాగతిస్తూనే...తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లును కూడా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కవిత మహిళా బిల్లును కేంద్ర ముందుకు తీసుకువచ్చారు.