ఉత్కంఠ భరితంగా హీరా గ్రూప్ కుంభకోణం కేసు

SMTV Desk 2019-01-10 14:33:57  Noheera shail, Heera group of companies, scam case

అమరావతి, జనవరి 10: హీరా గ్రూప్ కుంభకోణం కేసు రోజు రోజుకి ఉత్కంఠగా మారుతుంది. అయితే ఈ కేసు విచారణలో సాక్షులను, భాదితులను ఓ కిరాయి హంతక ముఠా బెదిరించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. నౌ హీరాపై ఫిర్యాదు చేసినా.. సాక్షం చెప్పినా చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. సోషల్‌ మీడియా ద్వారా రివాల్వర్‌తో బాధితుల సెల్‌ఫోన్లకు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో బాధితులు వీడియో ఫుటేజ్‌ని పోలీసులకు అందించారు. వీడియో ఆధారంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

హీరా కేసులో కోర్టుకు వెళ్లాలంటే బాధితులు భయపడుతున్నారు. హీరా గోల్డ్‌ కేసులో ఉగ్రవాదులు సైతం పెట్టుబడి పెట్టినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. ఈ కేసులో ఎవరు కల్పించుకున్నా కాల్చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. తమను బెదిరించిన వారు ఉగ్రవాదులై ఉంటారని బాధితుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగారు ఆభరణాలు, వజ్రాల పథకాలతో దేశ విదేశాల్లో ప్రజల నుంచి రూ. వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన హీరా గ్రూప్ సంస్థ ఛైర్మన్‌ నౌహీరా షేక్‌పై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.