అతిపెద్ద క్రికెట్ స్టేడియం...

SMTV Desk 2019-01-10 14:32:39   Motera Stadium, Ahmedabad, Melbourne Cricket Ground, Gujarat

అహ్మదాబాద్, జనవరి 10: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం భారత్ లో నిర్మాణం అవుతుంది. అహ్మదాబాద్‌లోని మొతెరాలో 63 ఎకరాల విస్తీర్ణంలో లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో, రూ.700 కోట్ల ఖర్చుతో గుజరాత్ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు. ఈ స్టేడియానికి సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియం అని పేరు పెట్టారు. 2018లో శంకుస్థాపన చేసిన ఈ స్టేడియం నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2019 వరల్డ్ కప్ వరకు కంప్లీట్ చేయాలనే ప్లాన్ చేసినా,కానీ కాస్త ఆలస్యం అవుతుందన్నారు. మొత్తంగా ఈ సంవత్సర చివరన స్టేడియం నిర్మాణం పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలిపారు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు.

90వేల సీటింగ్ కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్ స్టేడియం ఉండగా, లక్షమంది సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియం నిర్మిస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఎంపీ పరిమల్ నత్వాని తెలిపారు. ఈ గ్రౌండ్ వర్షం వచ్చినా తడవదు. వర్షం వస్తే స్టేడియం పైకప్పు ఆటోమేటిగ్గా మూసుకుంటుంది.