యశ్ అభిమాని అఘాయిత్యం

SMTV Desk 2019-01-10 13:39:51  Yash, KGF Movie, fan dead

బెంగుళూరు, జనవరి 10: హీరో యశ్ తో మాట్లాడే అవకాశం కల్పించలేదనే బాధతో అయన అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటకలోని పావగడకి చెందిన రవి (28) అనే యువకుడు యశ్ కు వీరాభిమాని. యశ్ పుట్టినరోజు సందర్బంగా ప్రతి ఏడాది జనవరి 8న ఆయన నివాసానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవాడు. కాగా, ప్రముఖ నటుడు అంబరీష్ మృతి వల్ల ఈ సంవత్సరం జన్మదిన వేడుకలను జరుపుకోవడంలేదని యశ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు.

అయితే, పుట్టినరోజు సందర్భంగా యశ్ నివాసానికి రవి వెళ్లాడు. రవిని కలిసేందుకు యశ్ నిరాకరించడంతో... మనస్తాపానికి గురై యశ్ నివాసం ముందే పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. వెంటనే అతన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఐసీయూలో చికిత్స పొందుతున్న రవి ఈ తెల్లవారుజామున మరణించాడు.