నిర్మాతగా మారిన ప్రముఖ హీరో

SMTV Desk 2019-01-10 13:02:13  Vijay Devarakonda, pelli cupulu, Tharun Baskar, producer, Production house

హైదరాబాద్, జనవరి 10: అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ, అతను ఏది చేసినా కొత్తగా వుండాలని కోరుకుంటాడు. అందరికంటే విభిన్నంగా అనిపించే నిర్ణయాలు తీసుకుని ఆశ్చర్యపరుస్తుంటాడు. తాజాగా విజయ్ అలాంటి సంచలన నిర్ణయమే మరొకటి తీసుకున్నాడు. హీరోగా వరుస సినిమాలతో బిజీగా వున్న విజయ్, ప్రొడక్షన్ హౌస్ స్థాపించటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. నిర్మాతగా మారి సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. దానికి సంబంధించిన పనులు చకచకా అమలు చేస్తున్నాడు.

విజయ్ దేవరకొండ తన బ్యానర్లో నిర్మించే సినిమా ద్వారా హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నది ఎవరినో కాదు .. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ నే. తనకి పెళ్లి చూపులు లాంటి మంచి హిట్ ఇచ్చినందుకు ఈ రకంగా ఆ ఋణాన్ని తీర్చుకుంటున్నాడన్న మాట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. త్వరలోనే ఈ సినిమా దర్శకుడు, మిగతా నటీనటుల గురించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని తెలుస్తోంది.