కోర్టుకు వెళ్ళటానికి డబ్బులు లేవు అన్న మాజీ ప్రధాని

SMTV Desk 2019-01-10 12:35:01  Manmohan Singh, The Accidental Prime Minister, cort, less money

న్యూఢిల్లీ, జనవరి 10: భారత దేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వద్ద డబ్బులు లేవట. పది సంవత్సరాలు భారత దేశానికి ప్రధానిగా పనిచేసిన ఆయన వద్ద కనీసం కోర్టుకు వెళ్లడానికి డబ్బులు లేవట. ఈ విషయాన్ని ఏపీ మాజీ ఎంపీ, తన మిత్రుడు యలమంచిలి శివాజీతో ఆయనే స్వయంగా చెప్పారట. మన్మోహన్ బయోపిక్ గా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పేరిట ఓ చిత్రం తెరకెక్కింది.

ఈ చిత్ర ట్రైలర్ లో కొన్ని సీన్స్ మన్మోహన్ సింగ్ ను కించపరుస్తున్నట్టు కనిపించడంతో వివాదం చెలరేగింది. ఇక ఈ విషయంపై కోర్టును ఆశ్రయించి, పరువు నష్టం దావా వేయాలని మన్మోహన్ కు కొందరు సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని శివాజీ వద్ద ప్రస్తావించిన మన్మోహన్ సింగ్, కోర్టులో పోరాడేందుకు తన వద్ద డబ్బులు లేవని, న్యాయవాదులకు ఫీజులు చెల్లించలేనని అన్నారని సమాచారం.