మరో 31 ప్రత్యేక రైళ్ళు....

SMTV Desk 2019-01-10 12:34:31  South central railway zone, Secundrabad, Jansadaran trains, Sankranthi festivel

హైదరాబాద్, జనవరి 10: సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా దక్షిణ మధ్య రైల్వే శాఖ అదనంగా మరో 31 జనసదరన్ ప్రత్యేక రైళ్ళను నడిపిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్- తిరుపతి, తిరుపతి- కాకినాడ, విజయవాడ, విజయనగరం వరకు ఈ రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్- విజయవాడ, హైదరాబాద్- సికింద్రాబాద్, విజయవాడల మీదుగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి.

ఈ రైళ్లలో అన్‌రిజర్వుడ్ కోచ్‌లుంటాయని, ప్రత్యేక రుసుములు చెల్లించకుండా సాధారణ టికెట్ల రేట్లతోనే ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నది. ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.30 గంటలకు ఈ నెల 11, 12, 13, 15, 16, 17, 18, 19 తేదీల్లో బయలుదేరి ఉదయం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటాయి. నల్లగొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతాయి. విజయవాడ నుంచి తిరిగి సికింద్రాబాద్‌కు ఈనెల 12, 13, 14, 16, 17, 18, 19, 20 తేదీల్లో నడుస్తాయి.