తొలి వన్డే లో ఆసిస్ కు దెబ్బ ?

SMTV Desk 2019-01-10 12:20:02   Mitchell Marsh, Ashton Turner, India vs Australia, 1st One day

సిడ్నీ, జనవరి 10: భారత్‌తో ఓడిపోయి బాధలో ఉన్న ఆస్ట్రేలియాకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగలింది. ఇండియాతో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌లో, శనివారం సిడ్నీ వేదికగా జరిగే తొలి వన్డేకు ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ దూరమయ్యాడు. జీర్ణాశయ సంబంధిత రోగంతో బాధపడుతున్న మార్ష్‌ కొన్ని రోజులుగా ఆస‍్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాంతో మిచెల్‌ మార్ష్‌ తొలి వన్డేలో పాల్గొనడం లేదని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు. మిగతా రెండు వన్డేలకు మార్ష్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నాడు.


మిచెల్‌ మార్ష్‌ తేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అతని స్థానంలో ఆస్టాన్‌ టర్నర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన టర్నర్‌, పార్ట్‌టైమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కావడంతో అతన్ని ఎంపిక చేసినట్లు కోచ్‌ తెలిపాడు. మరొకవైపు ఆస్టన్‌ వికెట్ల మధ్య పరుగెత్తడంలో అథ్లెట్‌ను తలపిస్తాడన్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో ఆస్టన్‌ టర్నర్‌ పెర్త్‌ స‍్కార్చర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఆస్టన్‌ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో (60 నాటౌట్‌, 47, 43 నాటౌట్‌) రాణించాడు.