కోడంగల్ లో కాంగ్రెస్ అభ్యర్తి కిడ్నాప్...!!!

SMTV Desk 2019-01-09 21:22:30  Congress party leader Kidnapping, Telangana panchat elections, Nominations, Revanth reddy

కొడంగల్, జనవరి 9: పంచాయతి ఎన్నికల సందర్భంగా నామినేషన్ వెయ్యడానికి సిద్దమైన అభ్యర్ధి కిడ్నాప్ అవ్వడం కొడంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది. రేపు నామినేషన్ కు చివరి తేది అని అన్ని రాత్రే సిద్దం చేసుకొని ఉన వ్యక్తి ఉదయం మాయమయ్యాడు. ఈ సంఘటన వల్ల అక్కడి నియోజకవర్గ గ్రామాల్లోని నాయకుల మధ్య చిచ్చు రగిలిస్తుంది. తమ అభ్యర్థి కనబడకుండా పోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. పూర్తి వివారాల ప్రకారం నిటూరు గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసేందుకు విశ్వనాధ్ అనే నాయకుడు సిద్దమయ్యాడు. అయితే ఇవ్వాల మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండడంతో విశ్వనాధ్ నామినేషన్ వెయ్యడానికి నిన్న రాత్రే అన్ని సిద్దం చేసుకొని పడుకున్న విశ్వనాథ్ తెల్లారేసరికి కనిపించకుండా పోయాడు. పొద్దున లేచేసరికి అతడు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు.

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ పై సమాచారం అందుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నెట్టూరు గ్రామానికి వెళ్లారు. కిడ్నాప్ కు గురైన కుటుంబ సభ్యలును అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు. నామినేషన్ వేయడానికి ఇవాళే చివరిరోజు కావడంతో విశ్వనాథ్ ను ఫోటీ నుండి తప్పించేందుకు ప్రత్యర్థులే ఈ పని చేసి వుంటారని కుటంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు రేవంత్ కు తెలిపారు. దీంతో వెంటనే ఆయన జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ఈ కిడ్నాప్ గురించి ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విశ్వనాథ్ కోసం గాలింపు చేపట్టారు. రాజకీయ కక్ష్యతో ఈ కిడ్నాప్ జరిగిందా లేదా విశ్వనాథ్ వ్యక్తిగత శతృవులు ఎవరైనా ఈ పని చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.