టీం ఇండియా ఆటగాళ్ళ కొంపముంచిన టీవీ షో

SMTV Desk 2019-01-09 17:22:00   Hardik Pandya,Indian cricketer, Koffee With Karan, KL Rahul

న్యూఢిల్లీ జనవరి 9: పాపులర్‌ టీవీ షో ‘కాఫీ విత్‌ కరణ్‌ టాక్ షో‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చిక్కుల్లో పడ్డారు. ఈ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను బీసీసీఐ వాళ్లపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోంది.

మహిళలపట్ల అనుచితంగా మాట్లాడిన ఇండియన్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా క్షమాపణలు చెప్పాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ ఆల్‌రౌండర్‌ కొన్ని వారాల క్రితం ‘కాఫి విత్‌ కరణ్‌ లో మహిళల పట్ల అగౌరవంగా కామెంట్‌ చేశాడు. ‘షోలో నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా కించపరిచేవిగా ఉంటే క్షమించండి. ఆ షో తీరుకు భిన్నంగా వ్యవహరించాను. అయితే, ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా మాట్లాడలేదు అని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.


ఈ టాక్ షోలో హార్ధిక్ పాండ్యా చేసిన ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరచడమే కాకుండా, భారత సంస్కృతిని దిగజార్చాలే ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది.