10 శాతం రిజర్వేషన్లపై స్పందించిన హీరో నిఖిల్..

SMTV Desk 2019-01-09 13:24:26  Nikhil Siddartha, Narendra modi, ebc 10 percent reservations

హైదరాబాద్, జనవరి 9: యువ కథానాయకుడు నిఖిల్ కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పించిన 10 శాతం రిజర్వేషన్లపై స్పందిస్తూ మోదీ నిర్ణయాన్ని అభినందించాడు. కాగా ఇటీవల రానా హోస్ట్‌గా నిర్వహిస్తున్న ‘నెం.1 యారీ షోలో నిఖిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రానా, తాను అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై చర్చించుకున్నట్టు నిఖిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

నిఖిల్ తన ట్విట్టర్ ఖాతాలో ‘కొన్ని వారాల క్రితం రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే షోలో మేం ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కులం, మతం, జాతి గురించి పట్టించుకోకుండా మోదీ సర్‌ దీనిని నిజం చేసి అద్భుతమైన పనితీరును కనబరిచారు. జాతి వివక్షకు నో చెప్పండి అని ట్వీట్‌ చేసాడు.