అమెరికాలో 'శాతకర్ణి' రికార్డు బద్దలు కొట్టిన 'కథానాయకుడు'..

SMTV Desk 2019-01-09 12:20:18  NTR Biopic, Balakrishna, Krish

హైదరాబాద్, జనవరి 9: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్.టి.ఆర్. ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు కథానాయకుడు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

అయితే అమెరికాలో నిన్ననే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ ఉదయం వరకు వేసిన షోలతో ఈ చిత్రం 4,40,000 డాలర్లను (రూ. 3,09,87,000) వసూలుచేసింది. ఈ క్రమంలో బాలయ్య గత చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి రికార్డును బద్దలు కొట్టింది. శాతకర్ణి సినిమా ప్రీమియర్ షో ద్వారా తొలి రోజు రూ. 3,75,000 డాలర్లు (రూ. 2,64,14,812) వసూలు చేసింది. ఆ రికార్డును కథానాయకుడు అధిగమించింది.