ఎన్టీఆర్: బోర్ గా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు..

SMTV Desk 2019-01-09 11:12:53  NTR Biopic, Balakrishna, Krish

హైదరాబాద్, జనవరి 9: నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా యన్.టి.ఆర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కథానాయకుడు రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల చిత్రం ప్రదర్శితమైంది. రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదలకానుంది.

ఇక ఈరోజు వచ్చిన కధానాయకుడు విషయానికి వస్తే, సినిమా గురించి యావరేజ్ టాక్ నడుస్తుంది. ఈ సినిమాకి బాలకృష్ణ పోషించిన 63 గెటప్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దాంతో పాటు ఎన్టీఆర్ పార్టీ స్థాపించటం, చిత్ర క్లైమాక్స్ హైలెట్ గా నిలిచాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో నిడివి ఎక్కువ ఉండటం వల్ల, ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటికే ఎక్కువ సార్లు చుసిన కారణంగా బోర్ గా ఫీల్ అవుతున్నారు.


టైటిల్: ఎన్టీఆర్ కథానాయకుడు
నటీనటులు: బాలకృష్ణ .. విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక .. రానా .. సుమంత్ .. కల్యాణ్ రామ్ తదితరులు.
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: క్రిష్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నిర్మాత: బాలకృష్ణ