వేగంగా సినిమాలు చేస్తున్న హీరో నిఖిల్

SMTV Desk 2019-01-09 10:29:07  Nikhil, Mudhra, Release

హైదరాబాద్, జనవరి 9: హ్యాపీ డేస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు నిఖిల్ మొదటి నుంచి కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ వున్న నిఖిల్ అది ఎంతమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన కిరాక్ పార్టీ క్రితం ఏడాది థియేటర్ల దగ్గర సందడి చేసింది. అప్పటి నుంచి ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులు వేచి చేస్తున్నారు.

ప్రస్తుతం నిఖిల్ ముద్ర అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన శ్వాస అనే సినిమాతో సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఈ సినిమా కూడా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. కిషన్ కట్టా అనే కొత్త కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నిఖిల్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదలవుతుందట. ఈ సినిమా వివరాలను రేపు చెబుతానని ఆయన ట్వీట్ చేశాడు. ముద్ర రిలీజ్ డేట్ ను కూడా రేపే చెప్పేస్తానని అన్నాడు. మొత్తానికి ఈ ఏడాది మూడు సినిమాలతో నిఖిల్ వొక రేంజ్ లో సందడి చేస్తాడన్న మాట.