నాది కూడా రాజమౌళి స్టైలే!!

SMTV Desk 2017-07-28 14:20:48  sampath nandi, rajamouli, student no 1, goutham nandha

సంపత్ నంది దర్శకత్వం వహించిన గౌతమ్ నంద సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, హీరో గోపిచంద్ అద్భుత నటన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. అప్పట్లో కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుని, ఆ తరువాత ఆ కథలోని పాత్రలకి తగిన నటీనటులను ఎంపిక చేసుకునేవారు దర్శకులు, కానీ ఇపుడు ఆ స్టైల్ మారింది హీరో కోసం డేట్స్ అడిగి, ఆ తర్వాత హీరోకి తగ్గట్టు కథనాలు సిద్దం చేస్తున్నారు, కానీ ఈ విషయంలో రాజమౌళి మాత్రం పాత స్టైల్ నే ఫాలో అవుతున్నాడు , ఆయన కథ రెడీ అయిన తరువాతనే, పాత్రలకి తగిన నటీనటులను తీసుకుంటారు. ఇప్పుడు సంపత్ నంది కూడా రాజమౌళి పంథానే ఫాలో అవుతున్నాడు, గౌతమ్ నంద నుంచి తనదీ అదే పద్ధతి అంటున్నాడు ఈ యువ దర్శకుడు. కథను రెడీ చేసుకున్న తరువాతనే గోపీచంద్ ను తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పాడు. హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తుండటం వలన, మంచి కథలకు ప్రాధాన్యం ఇవ్వలేక పోతున్నామని ఆయన అన్నారు. నా తదుపరి మూవీ కి కూడా నాలుగు నెలల సమయం తీసుకుని మంచి కథను సిద్ధం చేసుకుంటాననీ .. ఆ తరువాతనే కథకి తగిన హీరో గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు.