నూతన ఎమ్మెల్యేకి అవమానం ...

SMTV Desk 2019-01-08 18:54:33  Pilot rohit reddy, Congress, MLA, Muncipal council

వికారాబాద్, జనవరి 8: మంగళవారం తాండూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నూతన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పరుష పదాజాలంతో రెచ్చిపోయారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాకను టీఆర్ఎస్ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయకుండా రోహిత్‌ రెడ్డి మున్సిపల్‌ సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తీరును తప్పుబడుతూ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

దీంతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి నోరు జారారు. ఏ పిచ్చి నా కొడుకులు చెప్పారంటూ మండిపడ్డారు. మున్సిపల్‌ కమిషనర్‌కు సైతం ఎమ్మెల్యే క్లాస్ పీకారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నాన్సెన్స్ క్రియేట్ చేశారంటూ మండిపడ్డారు. అయితే అంతకుముందు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కౌన్సిలర్లు సన్మానం చెయ్యడం కొసమెరుపు.