కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన బీజేపీ

SMTV Desk 2017-07-28 14:06:42  bjp, amithsha, elections, namination, congress, mlaResignations

గుజరాత్, జూలై 28 : నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. తాజాగా మరో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాజీనామా చేయడంతో బీజేపీకి ఇది మరింత కలిసి రానుంది. గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం దారుణంగా దెబ్బతింటోంది. కాంగ్రెస్‌ పార్టీకీ గుడ్‌బై చెప్పిన శంకర్‌సిన్హ వాఘెలా అన్నట్లుగానే కాంగ్రెస్‌ పార్టీపై కక్ష తీర్చుకుంటున్నారు. గురువారం ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు అసెంబ్లీ స్పీకర్‌ రమణ్‌లాల్‌ వోరాకు అందజేశారు. దీంతో ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ను వీడినట్లయింది. ఇది కాంగ్రెస్‌పార్టీ నేత అహ్మద్‌ పటేల్‌కు గట్టి ఎదురుదెబ్బ మాత్రమేకాకుండా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పెద్ద షాక్‌.