పైరసీని అరికట్టమంటున్న బాలయ్య..

SMTV Desk 2019-01-08 17:54:02  NTR Biopic, Balakrishna, Krish

హైదరాబాద్, జనవరి 8: నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా యన్.టి.ఆర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కథానాయకుడు, మహానాయకుడు అని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న కథానాయకుడు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర ప్రమోషన్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వొక వీడియో వదిలారు. "అందరికీ నమస్కారం .. ఎన్టీఆర్ కథానాయకుడు రేపు 9న విడుదల కాబోతోంది. అందరూ థియేటర్లకు వెళ్లి చూడండి .. పైరసీని అరికట్టండి" అని చెప్పారు.

ప్రేక్షకులంతా ఈ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పోషించిన వివిధ పాత్రల్లో బాలకృష్ణ ఎలా కనిపించనున్నారు? రకరకాల గెటప్పులతో ఆయన ఎలా మెప్పించనున్నారు? అనేది తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఆయా పాత్రల్లో విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక .. రానా .. సుమంత్ .. కల్యాణ్ రామ్ ఎలా వొదిగిపోయారనేది చూడటానికి ఆత్రుతను కనబరుస్తున్నారు.