చేతులెత్తేసిన శ్రీలంక

SMTV Desk 2017-07-28 13:59:33  india, srilanka test match, 2017

శ్రీలంక, జూలై 28 : గాలే లో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక చేతులెత్తేసింది. భారత్ నిర్దేశించిన 600 పరుగులను శ్రీలంక చేధించలేకపోయింది. కేవలం 291 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాటింగ్ ఉపుల్ తరంగ 64, మాథ్యూస్ 83, పెరేరా 92 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్ మెన్స్ అంత తక్కువ పరుగులకే ఔటయ్యారు. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత్ స్కోర్ 1 వికెట్ నష్టానికి 44 చేసింది. ప్రస్తుతం బ్యాటింగ్ అభినవ్ ముకుంద్ 18, చటేశ్వర్ పుజార 12 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.