వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న తెదేపా నేత...

SMTV Desk 2019-01-08 16:27:51  Budda nagheshwar rao, TDP, YSRCP

అమరావతి, జనవరి 8: రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు తమ తమ అభ్యర్దులు పక్క పార్టీలోకి వెళ్ళకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయినా కాని కొంత మంది నేతలు సొంత పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీలోకి దారులు వెతుక్కుంటున్నారు. వొక పార్టీలో నుండి మరొక పార్టీలోకి జంపింగ్ లు ఎకువయ్యాయి. మంగళవారం ఉదయం వైసీపీ కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ లోకి చేరుతా అని ప్రకటించారు. కాగా తాజాగా అధికార తెలుగు దేశం పార్టీ విప్ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వర రావు పార్టీని వీడనున్నట్లు ప్రకటించాడు. దీంతో కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా విజయవాడ టిడిపి కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేపడుతున్న వైఎస్సార్ సిపి అధినేత జగన్‌ను కలిసిన తర్వాత బుద్దా నాగేశ్వర రావు తన పార్టీ మార్పుపై అధికారికంగా ప్రకటనచేశారు. టిడిపి పార్టీ విధానాలు నచ్చకే వైఎస్సార్‌సిపి పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తమ సోదరుడు బుద్దా వెంకన్న బిసి సమస్యలపై ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. ఆయనతో పాటు టిడిపిలో కీలకంగా వున్న చాలామంది బిసి నేతలు కూడా బిసిలకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు. ఇది నచ్చకే మరికొందరు బిసి నేతలు టిడిపి వీడి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దంగా వున్నట్లు నాగేశ్వరరావు ప్రకటించారు.

బిసిలకు వైఎస్సార్‌సిపి పార్టీ వల్లే న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ అధినేత జగన్ కూడి అధికారంలోకి రాగానే బిసి సబ్ ప్లాన్ అమలు చేయడానికి సిద్దంగా వున్నానని హామీ ఇచ్చారని....అందువల్లే ఈ పార్టీలో చేరుతున్నట్లు బుద్దా నాగేశ్వరరావు తెలిపారు.