ఒక్క రూపాయికే బ్యాక్‌ప్యాక్ బ్యాగ్

SMTV Desk 2019-01-08 13:33:35  RS.1, Lap top bag, Real me, Amazon

జనవరి 8: మంచి ల్యాప్‌టాప్ బ్యాగ్ కొనాలనుకుంటే అందుకోసం వందలు, వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వొక్క రూపాయి చాలు. అవును... రూ.1 చెల్లించి రూ.2,399 విలువైన బ్యాగ్ సొంతం చేసుకోవచ్చు. ఇదేం ఆఫర్ అనుకుంటున్నారా? ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రియల్‌మీ... యో డేస్ పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఆఫర్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ జనవరి 9న ముగుస్తుంది.

రియల్‌మీ యూ1, రియల్‌మీ 2, రియల్‌మీ సీ1, రియల్‌మీ 2 ప్రో ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్‌లో రియల్‌మీ యూ1 కొన్న వారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీపెయిడ్ ఆర్డర్లపై కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. రియల్‌మీ అఫిషియల్ ఇ-స్టోర్‌లో రియల్‌మీ యూ1 కొన్న మొదటి 500 మందికి ఇయర్‌బడ్స్ ఉచితంగా లభిస్తాయి. ఇక ఈ సేల్‌లో గొప్ప ఆఫర్ ఏంటంటే రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్ కేవలం రూ.1 చెల్లించి కొనొచ్చు. అది కూడా 300 మందికే అవకాశం. జనవరి 7 నుంచి 9 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఉంటుంది.