నాగబాబు వీడియోలపై స్పందించిన వర్మ!

SMTV Desk 2019-01-08 13:10:53  Balakrishna, Nagababu, Comments, Ram gopal varma, Tweet

హైదరాబాద్, జనవరి 8: చిరంజీవి కుటుంబంపై గతంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ప్రస్తుతం వీడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా నాగబాబు వీడియోలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. ‘కామెంట్లు చేయ‌డంలో న‌న్ను మించిపోయార‌నే బాధ వొక‌వైపు.. త‌న స్టార్ బ్ర‌ద‌ర్స్‌ను స‌మ‌ర్థించ‌డంలో సూప‌ర్‌స్టార్ అయిపోయార‌న్న ఆనందం మరోవైపు.. వొక కంట క‌న్నీరు, మ‌రో కంట ప‌న్నీరు. నాగ‌బాబు గారూ హ్యాట్సాఫ్‌.. మీ సోద‌రుల‌ను మీరు ఎంత‌గా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం` అని ట్వీట్ చేశారు.