మల్కాజ్ గిరిలో దారుణం

SMTV Desk 2017-07-28 13:32:28  hydarabad, malkajgiri, murder

హైదరాబాద్, జూలై 28 : హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో నివాసముంటున్న షబ్బీర్ అలీ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి చంపిన సంఘటన నగరంలో సంచలనం రేపింది. . ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నామని పోలీసులు తెలియజేశారు.