టాటూ .. చాలా నొప్పి భరించాను: చరణ్

SMTV Desk 2019-01-08 12:35:21  Ram Charan, Vinaya Vidheya Rama, Boyapati Srinu, kiara advani, Tatoo

హైదరాబాద్, జనవరి 8: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చరణ్, బోయపాటి కాంబినేషన్లో తొలిసారిగా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్ బిజీగా వున్నాడు. తాజా ఇంటార్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో పేరుకి తగినట్టుగానే నా పాత్ర ఉంటుంది. రాముడితో యుద్ధం చేయాలని ఎవరూ అనుకోకూడదు. నేను కూడా ఈ సినిమాలో అలాగే కనిపిస్తాను.

ఈ చిత్రంలో కొన్ని సీన్స్ లో వొంటినిండా టాటూతో కనిపిస్తాను. అది స్టిక్కర్లతో వేసిన టాటూ .. అది వేయడానికి 2 గంటలు .. తీయడానికి గంటన్నర సమయం పట్టేది. ఆ స్టిక్కర్ తీసేటప్పుడు చాలానొప్పిగా ఉండేది .. అయినా అలాగే భరించాను. గతంలో తమన్నా మంచి డాన్సింగ్ పార్ట్నర్ అనిపించింది. మళ్లీ ఇప్పుడు కైరా అద్వాని మంచి డాన్సింగ్ పార్ట్నర్ గా అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చారు. ఇక కైరా అద్వాని కళ్లు కూడా చాలా బాగుంటాయని కితాబునిచ్చాడు.