నేడు ఆటోల సమ్మె...

SMTV Desk 2019-01-08 11:44:08  Hyderabad, Auto, Cabs, MV Act, strike

హైదరాబాద్, జనవరి 8: హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజు ఉదయం నుండి ఆటోలు, క్యాబ్‌లు రోడ్డెక్కలేదు. 2018 ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో రవాణా సేవలు నిలిచిపోయాయి. అయితే ఈ సమ్మెకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్ధతు తెలిపింది.

నగరంలో ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా ఇదే సమయంలో న్యూడెమోక్రసీ, టీ మాస్ ఫోరమ్ కూడా మద్ధతు ప్రకటించాయి. క్యాబ్‌లు, ఆటోల సేవలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.