పాక్ ప్రధాని షరీఫ్ కు చుక్కెదురు

SMTV Desk 2017-07-28 13:30:32  Navaj Shareef, PAK PM, Panama papers,

పాకిస్తాన్, జూలై 28: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటించిన ఆ దేశ సుప్రీం కోర్టు. పనమా పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ ఉన్నత న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు అసత్య కంపెనీల పేరుతో లండన్‌లో అక్రమాస్తులు కూడబెట్టారని గత ఏడాది పనామా పత్రాలు వెల్లడించాయి. ఈ ఆధారాలతో ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం 6గురు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని వేసింది.ఈ బృందం విచారణ పత్రాలను ఈ నెల 10న సుప్రీం కోర్టుకి సమర్పించింది. ఈ మేరకు కోర్టు ఈ నెల 21న విచారణ పూర్తిచేసినప్పటికీ, తుది తీర్పు ఈ రోజు వెల్లడించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల పై షరీఫ్ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.