'పీఎమ్ నరేంద్ర మోదీ' నుంచి ఫస్టులుక్..

SMTV Desk 2019-01-07 19:51:53  Narendra Modi, Biopic, First look

ముంబై, జనవరి 7: టాలీవుడ్, బాలీవుడ్ లలో బయోపిక్ ల జోరు మరింత ఊపందుకుంటోంది. ఇప్పటికే కొన్ని బయోపిక్ లు సెట్స్ పై ఉండగా, మరికొన్ని బయోపికలు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కోసం వివేక్ వొబెరాయ్ ను ఎంపిక చేసుకున్నారు. ఇటీవల ఈ సినిమాకి పీఎమ్ నరేంద్ర మోదీ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాకి వొమంగ్ కుమార్ దర్శకత్వం వహించగా సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు. నరేంద్ర మోదీ బాల్యం .. విద్యాభ్యాసం .. రాజకీయ ప్రవేశం .. అంచలంచెలుగా ఎదిగిన తీరు ఈ బయోపిక్ లో చూపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్టులుక్ పోస్టర్ ను 23 భాషల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లాంచ్ చేశారు. నరేంద్ర మోదీ లుక్ లో వివేక్ వొబెరాయ్ బాగా కుదిరిపోయాడు. తన కెరియర్లోనే చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలిచిపోతుందని వివేక్ వొబెరాయ్ బలంగా నమ్ముతున్నాడు.