టీం ఇండియాపై పలువురు ప్రశంసల జల్లు..

SMTV Desk 2019-01-07 18:04:52  Narendra modi, chandrababu, jagan mohan reddy, Mahesh babu, Twitter, ind vs Aus test match, wishes

హైదరాబాద్, జనవరి 7: ఆసీస్ తో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను టీం ఇండియా 2-1తో ద‌క్కించుకున్న విషయం విదితమే. సిడ్నీలో జ‌రిగిన చివ‌రి టెస్ట్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా డ్రాగా ముగిసింది. దాంతో సిరీస్ భార‌త్ వ‌శమైంది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఈ ఘన విజయాన్ని సాధించడంతో దేశమంతా కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, సీఎం చంద్రబాబు, ప్రిన్స్ మహేష్ బాబు టీమిండియా సాధించిన విజయంపై ట్విట్టర్ వేదికగా ఆనందోత్సాహాలు ప్రకటించారు. మహేష్ బాబు ‘అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు టీం ఇండియాకు అభినందనలు. జాతి మొత్తం నిజంగా గర్వించదగిన క్షణం’ అంటూ ట్వీట్‌ చేసారు.