తెలుగులో లాభాలు తెచ్చిపెట్టిన 'కేజీఎఫ్'..

SMTV Desk 2019-01-07 17:40:07  Yash, KGF Movie, Telugu Collections

హైదరాబాద్, జనవరి 7: యశ్ నటించిన కేజీఎఫ్ భారీ వసూళ్ళ దిశగా దూసుకుపోతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లోను ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదలైంది. తెలుగులో అదే రోజున వరుణ్ తేజ్ అంతరిక్షం ..శర్వానంద్ పడి పడి లేచె మనసు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక హిందీలో అయితే ఇదే రోజున బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ జీరో సినిమా విడుదలైంది. అయినా ఈ సినిమా రెండు భాషల్లోని గట్టి పోటీని తట్టుకుని నిలబడింది. కన్నడతో పాటు హిందీలోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఆ స్థాయిలో దూకుడు చూపకపోయినా, తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టింది.

వారాహి చలన చిత్రం వారు ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను 5 కోట్లకి కొనుగోలు చేసి విడుదల చేశారు. తొలివారంలో 5 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, 17 రోజులకి గాను 10.29 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అలా ఈ సినిమా వారాహి చలనచిత్రం వారికి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మధ్య పెద్దగా లాభాలు రాని సినిమాలతో ఇబ్బంది పడుతోన్న వారాహి వారికి ఈ సినిమా ఊరట నిచ్చిందని చెప్పుకుంటున్నారు.