బాలీవుడ్ ఆఫర్ తిరస్కరించిన విజయ్

SMTV Desk 2019-01-07 17:24:51   Arjun reddy, Vijay Devarakonda, Kapil Dev, Movie, News, Jeeva

హైదరాబాద్, జనవరి 7:యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో విజయ్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్‌ రావటంతో, అక్కడ ఎంట్రీపై కూడా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కపిల్ దేవ్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘83’ సినిమాలో విజయ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయంపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు.

విజయ్‌ దేవరకొండ 83లో నటించటం లేదని తెలుస్తోంది. బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తే హీరోగానే ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న విజయ్‌, కపిల్ బయోపిక్‌ ఆఫర్‌కు నో చెప్పటంతో ఆ పాత్రకు తమిళ యువ కథానాయకుడు జీవాను తీసుకున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిర్మాతల్లో వొకరైన విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు.