ఫిబ్రవరి 14న బన్నీ సినిమా లాంచ్

SMTV Desk 2019-01-07 16:52:18  Allu arjun, New Movie, Lunch, Valentine day

గత సంవత్సరం బన్నీ నా పేరు సూర్య సినిమా పెద్దగా విజయం సాధించలేక పోయింది. దాంతో తరువాత చేసే చిత్రం ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ కారణంగానే ఆయన విక్రమ్ కుమార్ .. పరశురామ్ వంటి దర్శకుల ప్రాజెక్టులను సైతం పక్కన పెట్టేసి, త్రివిక్రమ్ తోనే సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు.

ప్రేమికుల రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి, దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఇంతకుముందు త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో జులాయి .. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఆ రెండింటిని మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని బన్నీ ముందుగానే త్రివిక్రమ్ కి చెప్పేశాడట. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానిని తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.