అందరికి క్షమాపణలు చెబుతున్నాను: అనసూయ

SMTV Desk 2019-01-07 16:45:21  Anasuya, Anchor, Social media, apologies

హైదరాబాద్, జనవరి 7: గత సంవత్సరం అనసూయ చేసిన రంగస్థలం సినిమా ఆమెకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ చిత్రం తరువాత అనసూయను అందరు రంగమ్మత్త అని పిలుస్తన్నారు. ఈ పాత్రకిగాను అనసూయ జీ సినిమా అవార్డ్స్ 2018 వేడుకలో అవార్డును సొంతం చేసుకుంది. రంగమ్మత్త పాత్రకి గాను తొలి అవార్డు జీ సినిమా అవార్డ్స్ వేదికపై అందుకున్న అనసూయ, ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించింది.

ఈ అవార్డుకిగాను నన్ను ఎంపిక చేసిన జీ తెలుగు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీ సినిమా అవార్డ్స్ తెలుగు 2018 నుంచి రంగమ్మత్త పాత్రకిగాను తొలి అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. అవార్డును గెలిచిన ఆనందంలో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అప్పుడు నా స్పీచ్ పెద్ద డిజాస్టర్ అని నేను భావిస్తున్నాను. చరణ్, మైత్రీ మూవీ మేకర్స్, రత్నవేలు, దేవిశ్రీ, నా భర్త, అమ్మానాన్నలకీ, రంగస్థలం సిబ్బందికి థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయాను. మీరంతా కూడా నా క్షమాపణలను అంగీకరించాలని కోరుతున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.