యువకుడి పై కత్తులతో దాడి

SMTV Desk 2017-07-28 13:22:49  nijamabad, distic, mandamarry, murder,

నిజామాబాద్, జూలై 28 : రమేష్ అనే వ్యక్తిని కత్తులతో దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మంద మర్రి కి చెందిన రమేష్ అనే యువకుడి పై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు వారిని పట్టుకునే లోపే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.