బీజేపీని వీడిన రాజమండ్రి ఎమ్మెల్యే...???

SMTV Desk 2019-01-07 15:51:51  BJP, Janasena, Aakula sathyanarayana, Rajamandry, MLA

రాజమండ్రి, జనవరి 7: నగర అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీని వీడి జనసేనలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని అంతేకాక బీజేపీ లో ఇప్పటికే రాజీనామా చేసి జనసేన పార్టీలోకి రంగం సిద్దం చేసుకున్నాడని రాజకీయాల్లో వార్తలొచ్చాయి. అయితే వార్తలపై ఎమ్మెల్యే ఆకుల సత్యానారాయణ స్పందించారు. తాను ఇంకా బీజేపీ కి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. అయితే.. రాజీనామా చేయాలనే యోచనలో మాత్రం ఉన్నట్లు తెలిపారు. తాను ప్రస్తుతం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని కలిసేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు.

అయితే.. ఇప్పటి వరకు తనకు అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకలేదని తెలిపారు. అమిత్ షా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నట్లు వివరించారు. ఆయనతో చర్చించిన తర్వాతే.. తన రాజీనామా చేయాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.