యాత్ర నుంచి వైఎస్ విజయమ్మ ఫస్టులుక్ రిలీజ్..

SMTV Desk 2019-01-07 15:47:23  Yatra, Mamutti, YS Vijayamma, First look, Ashritha Vemuganti

హైదరాబాద్, జనవరి 7: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర రూపొందుతోంది. మలయాళ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, మహి.వి రాఘవ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన మమ్ముట్టి పోస్టర్స్ కి .. టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి నటించింది. ఆమెకి సంబంధించిన ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు.వైఎస్ విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటిని చుస్తే అచ్చం ఆమె లానే అనిపిస్తోంది. ఈ పాత్ర విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారనేది ఆమె లుక్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమా నుంచి మరికొద్ది సేపట్లో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులంతా ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.