మహేష్ దారిలో ప్రభాస్ ??..

SMTV Desk 2019-01-07 13:05:13  Mahesh babu, AMB Mall, Prabas, new mall

హైదరాబాద్, జనవరి 7: సూపర్ స్టార్ మహేశ్ బాబు హైదరాబాద్ లో నిర్మించిన ఏఎంబీ మాల్ ను గురించి తెలిసిందే. ఇప్పుడు అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అత్యంత విలాసమైన ఈ థియేటర్ లో సినిమాలు చూసిన ప్రేక్షకులు, ఆ అనుభూతి అద్భుతం అని చెబుతున్నారు. ఇక ఈ తరహా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణం చేసే ఆలోచనలో అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు వంటి చాలామంది నిర్మాతలు వున్నారు.

కాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణంపైనే దృష్టిపెట్టి ఆ దిశగా పనులను వేగవంతం చేశాడట. వొక్కో థియేటర్లో 170 సిట్టింగ్ సామర్థ్యంతో .. మొత్తం 670 సీట్ల సిట్టింగ్ కలిగిన స్క్రీన్లతో ఈ మాల్ ఉంటుందని అంటున్నారు. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో .. 106 అడుగుల వెడల్పు తెరతో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మితమవుతోందట. ఆసియాలో ఇంతపెద్ద తెర కలిగిన మల్టీ ప్లెక్స్ లలో ఇది రెండవదట. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో, చెన్నై, కోల్ కత జాతీయ రహదారి పక్కన పిండిపాళెం దగ్గర ఆయన ఈ మాల్ ను నిర్మిస్తున్నాడు.