అభిమానులకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్...

SMTV Desk 2019-01-07 12:05:49  KTR, Fans warning, Fans gropus, Social media

హైదరాబాద్, జనవరి 7: తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పేరుపై అభిమానలు వివిధ యువజన సంఘాలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని కేటీఆర్ పూర్తిగా తిరస్కరించి ఇలాంటివి ఏర్పాటు చేయడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అంటూ పేర్కొన్నారు. అభిమానం ఉంటే తెరాస పార్టీ అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలని సూచిస్తూ..ఓ ప్రకటన విడుదల చేశారు. తన పేరిట ఇప్పటికే ఏమైనా సంఘాలు ఏర్పాటుచేస్తే వెంటనే రద్దు చేసుకోవాలన్నారు. కేటీఆర్ యువసేనను ఏర్పాటుచేసిన కొందరు యువకులు ఆదివారం కేటీఆర్‌ను కలిశారు. వారిని సున్నితంగా మందలించిన కేటీఆర్ తక్షణమే దాన్ని రద్దు చేసి తెరాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.

వివిధ పేర్లతో యువత, కొంత మంది అభిమానులు కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవా దళ్ లాంటి సంస్థలు ఏర్పాటు చేసినట్లు తనకు తెలిసిందని వాటిని ఏమాత్రం ఆమోదించబోనని స్పష్టం చేశారు. సంబంధిత పేర్లపై సామాజిక మాధ్యమాల్లో ఉన్న పేజీలను సైతం వెంటనే తొలగించాలని తెలిపారు. పార్టీపై , తన పై అభిమానం ఉంటే కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.