యువ నటి మృతి!

SMTV Desk 2019-01-07 11:35:42  Orissa, TV actress, Nikitha, dead

భువనేశ్వర్, జనవరి 7: వొడిశా టెలివిజన్ నటి నికిత అలియాస్ లక్ష్మీప్రియ బెహరా మృతి చెందింది. మహానది విహార్ ప్రాంతంలో ఉన్న తన ఇంటికి వెళ్లిన నికిత ప్రమాదవశాత్తు టెర్రస్ పైనుంచి కిందపడింది. తీవ్ర గాయాలు అవ్వటంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్ర గాయాల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు నికిత తల్లిదండ్రులు, భర్త తెలిపారు. కాగా, టెర్రస్ పైనుంచి ఎలా కిందపడిందన్న విషయాలు తెలియరాలేదు.

కిందపడిన నికితను తొలుత ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు, అనంతరం కటక్‌లోని ఎస్‌సీబీ ఆసుపత్రికి తరలించారు. అక్కడామె పరిస్థితి మరింత విషమించడంతో మరోమారు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడామె చికిత్స పొందుతూ మరణించింది. ‘మా రా పనతకాని , ‘స్మైల్ ప్లీజ్ , ‘చోరీ చోరీ మానా చోరీ వంటి సినిమాల్లోనూ నికిత నటించింది. 2016లో గోపాల్‌పూర్‌కు చెందిన లిపన్ సాహుతో కటక్‌లో ఆమె వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమార్తె ఉంది. అయితే, ఇటీవల ఆమె తన భర్తకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.