ఏపీ సీఎంను కలిసిన అలీ

SMTV Desk 2019-01-06 18:30:21  AP, CM, Ali, Chandrababu, YSRCP

అమరావతి, జనవరి 6: ప్రముఖ హాస్యనటుడు అలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వొక గంట పాటు ఇద్దరూ ఏకాంతంగా సమావేశమయ్యారు. అలీ వైఎస్‌ఆర్‌సిపిలో చేరుతున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబును కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైనది. గత నెల ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌, అలీ కలుసుకొవడంతో అప్పటి నుంచి అలీ వైఎస్‌ఆర్‌సిపికి వెళ్లున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యాఖ్యలను నిజంచేస్తూ అలీ వైఎస్‌ఆర్‌సిపి తీర్ధం పుచ్చుకోబోతున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ నెల 9న వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు వైఎస్‌ఆర్‌సిపిలో చేరేందుకు అలీ సిద్ధంగా ఉన్నారని సమాచారం.