ఫైనల్ కు చేరిన హైదరాబాద్ అమ్మాయి

SMTV Desk 2017-07-28 12:43:43  hyderabad, girl, tennis, final

అస్సాం, జూలై 28 : హైదరాబాద్ అమ్మాయి టెన్నిస్ లో దూసుకుపోతుంది. అస్సాంలో గువాహటిలో జరుగుతున్న ఐటా అండర్-16 సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్న మెంట్ లో హైదరాబాద్ కు చెందిన సంజన అనే అమ్మాయి ఫైనల్ కు చేరింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీ ఫైనల్ లో సంజన 6-4, 6-2 తో తన ప్రత్యర్థి ఇషిక పై విజయం సాధించింది. ఈ విజయంతో సంజన ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో కూడా విజయం సాధించి కప్ గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది.