జాక్ స్ప్యారోపై సంచలన ఆరోపణలు

SMTV Desk 2019-01-06 18:20:35  Jhonney depp, Amber heard, Divorce, Jack sparrow, Pirates of the carebian

లాజ్ ఏంజిల్స్, జనవరి 6: హాలీవుడ్ విలక్షణ నటుడు జానీ డెప్ ఫై తన భార్య అంబర్ హియర్డ్. సంచలన వ్యాఖ్యలు చేసింది. కుటుంబ కలహాల నేపధ్యంలో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. గత రెండేళ్లుగా వీరి కేసు కోర్టులో నడుస్తోంది. జానీ డెప్ తన పట్ల ప్రవర్తించిన తీరుకి సంబంధించిన సాక్ష్యాలను అతడి భార్య అంబర్ కోర్టులో సమర్పించగా.. దానిలో కొన్ని విషయాలు బయటకి వచ్చాయి.

జానీ డెప్ బయటకి కనిపించేంత మంచివాడు కాదని, అతడి కారణంగా నేనొక బండరాయిగా అయిపోయానని అంబర్ తన వాంగ్మూలంలో పేర్కొంది. లాజ్ ఏంజిల్స్ లో తమ ఇంట్లో గొడవ జరుగుతున్న సమయంలో జానీ డెప్ తన ముఖంపై ఫోన్ విసిరి కొట్టాడని, తనను ఇష్టమొచ్చినట్లుగా పిడికిలి బిగించి కొట్టాడని అంబర్ పేర్కొంది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా బయటపెట్టింది. అయితే ఆమె సమర్పించినవి నిజమైన ఫోటోలు కాదని జానీ డెప్ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.