అమెరికాలో తెలంగాణవాసి పై కాల్పులు...

SMTV Desk 2019-01-06 17:12:22  USA, Telangana, Mahabubabad, Saikrishna, Michigan, Electrical engineer, Lawrence tech university

అమెరికా, జనవరి 6: వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ కు చెందిన సాయికృష్ణ అమెరికాలోని మిచిగాన్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఇతని పై అమెరికాలో గుర్తు తెలియని కొంత మంది వ్యక్తులు తుపాకితో కాల్చారు. ప్రస్తుతం సాయి ఆసుపత్రిలో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల ప్రకారం మిచిగాన్‌లోని లారెన్స్ టెక్ యూనివర్శిటీ నుండి సాయి కృష్ణ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సాయికృష్ణ తన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నాడు.

అదే సమయంలో డెట్రాయిట్ లో తాను పనిచేసే సంస్థలో విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది.దొంగలు సాయికృష్ణను నిలిపివేసి అతడిని కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దోపీడికి పాల్పడ్డారని సాయికృష్ణ స్నేహితులు చెబుతున్నారు.