అధికారుల తీరును నిరసిస్తూ రైతుల ధర్నా

SMTV Desk 2019-01-06 15:02:48  Gadwal, Kollapur, Vanaparti, Rabi season, Dam, Water supply

గద్వాల్, జనవరి 6: కొల్లాపూర్, వనపర్తి ప్రాంతాలకు జూరాల ప్రాజెక్టు నుండి రబీకి నీరివ్వకుండా ఆయకట్టు చివరి భూములకు నీరు విడుదల చేయడాన్ని అక్కడి రైతులు అడ్డుకొన్నారు. కానీ, పోలీసుల సహాయంతో అధికారులు నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతుండడంతో రబీ సీజన్‌కు నీరివ్వాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయకట్టు చివరి భూముల రైతాంగానికి నీరివ్వాలని కూడ ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పంట నష్టపోకుండా చివరి దశలో నీరివ్వాలసి వనపర్తి, కొల్లాపూర్ రైతులు డిమాండ్‌తో కొంత ఉద్రిక్తత నెలకొంది. రబీకి నీరివ్వకుండా ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేయడంతో నష్టపోతామని గద్వాల పరిసర ప్రాంత రైతులు ఆందోళనగా ఉన్నారు. కొల్లాపూర్, వనపర్తి ప్రాంతాలకు నీరు విడుదల చేయకుండా అడ్డుకొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానిక రైతులకు నచ్చచెప్పారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసుల సహాయంతో అధికారులు దిగువ ప్రాంత రైతాంగానికి నీటిని విడుదల చేశారు.