అమెరికాకు చైనా నుండి యుద్ద సంకేతాలు

SMTV Desk 2019-01-06 14:23:53  Chaina, USA, War, Xinpang

చైనా, జనవరి 6: చైనా అధ్యక్షుడు గ్జిజిన్‌పింగ్‌ తమ దేశ సంరక్షణ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణచైనా సముద్రజలాల్లోప్రాదేశిక వివాదాలకు సంబంధించి పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా అవసరమైతే యుద్ధానికి సన్నద్ధం కావాలని తమ దేశ సైనికదళాలను అప్రమత్తంచేస్తూ సంకేతాలిచ్చారు. ప్రాదేశిక జలవివాదాల్లో చైనా తన పట్టును మరింత పెంచుకుంటున్నది. ఇప్పటికే దక్షిణచైనా సముద్ర జలాలప్రాంతం తమదేనని చెపుతూ వస్తున్న చైనా ఈ ప్రాంతంలో తరచూ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నదని పొరుగుదేశాల అధినేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వాణిజ్యం నుంచి తైవాన్‌కు ఉన్న హోదా వరకూ వివాదాలు చెలరేగుతున్నాయి. చైనా సాయుధ దళాలు అత్యవసరపరిస్థితులకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే యుద్ధానికి సైతం సిద్ధం కావాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మిలిటరీ అధిపతుల సమావేశంలో పేర్కొన్నారు.

అమెరికాతో ఉన్న వాణిజ్యవివాదాలకుతో దక్షిణచైనా ప్రాదేశిక జలాలపై తరచూ రెండుదేశాలమధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వాణిజ్యం నుంచి తైవాన్‌ ప్రత్యేక హోదా వరకూ అన్ని అంశాలపైనా చైనా తమదే అధికారం పట్టు అని ప్రకటిస్తూవస్తున్న సంగతి తెలిసిందే. జిన్‌పింగ్‌ టాప్‌ మిలిటరీ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ సాయుధ శక్తులు మన దేశ ప్రాదేశిక ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, పెరుగుతున్న అన్ని సవాళ్లను అధిగమించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారిక వార్తా సంస్థ గ్జిన్‌హువా వొక కథనాన్ని ప్రచురించింది. కేంద్ర మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌కూడా అయిన జిన్‌పింగ్‌ సాయుధ దళాలు ముందుగానే వ్యూమాలను రూపొందించుకుని కొత్త శకానికి సిద్ధం కావాలని, తప్పనిపరిస్థితులు వస్తే యుద్ధానికిసైతం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ శతాబ్దంలో ఎన్నడూ చూడని పెద్ద మార్పులను ప్రపంచం ఎదుర్కొంటున్నదని, చైనా ఇప్పటికీ వొక కీలకమైన వ్యూహాత్మక అభివృద్ధి అవకాశం కలిగి ఉందని దక్షిణచైనా సముద్రజలాలనే ఉటంకిస్తూ జిన్‌పింగ్‌పేర్కొన్నారు. సాయుధ శక్తులు తక్షణమే అత్యవసరసరిస్థితుల్లో సైతం సన్నద్ధం కావాల్సి ఉంటుందని, వారి వారి సంయుక్త కార్యకలాపాల సామర్ధ్యం, నైపుణ్యం కొత్త మార్గాల్లో తుదముట్టించే విధానాలు మరింత నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. తైవాన్‌తో తిరిగి పునరేకీకరణ హక్కులు చైనాకు కలిగి ఉన్నాయన్న జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు ఈప్రాంతంలో మరింత ఉద్రిక్తతలను పెంచాయి. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని కట్టడిచేసే హక్కులు సైతం కలిగి ఉన్నట్లు జిన్‌పింగ్‌ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ ఆసియా రీ అస్యూరెన్స్‌ ఇనిషియేటివ్‌ చట్టంపై సంతకం చేసిన కొన్ని రోజులకే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈప్రకటన చేయడంతో ఈప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనేందుకు అవకాశం కలిగింది. అమెరికా ఈ తైవాన ద్వీప రక్షణకు కట్టుబడి ఉంటుందని అమెరికా స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.