ముగిసిన నాలుగో రోజు ఆట

SMTV Desk 2019-01-06 13:47:45  Test match, Team india, Australia, Bad light

సిడ్నీ, జనవరి 6: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలోభారత్, ఆసిస్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. నిన్న వెలుతురు లేమీ, వర్షం కారణంగా తాత్కాలికంగా మ్యాచ్‌ను నిలిపివేసిన అంపైర్లు.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో నాలుగోరోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే అలౌటైన ఆసీస్ 322 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడుతోంది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లకు వికెట్ పడకుండా 6 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 4, మార్కస్ హారిస్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.