'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై బాలయ్య తోలి స్పందన

SMTV Desk 2019-01-06 13:35:56  Ram gopal varma, Balakrishna, Lakshmis NTR, Laxmi parvati

హైదరాబాద్, జనవరి 6: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీనియర్ ఎన్టీఅర్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ . ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ఈ సినిమా విడుదల చేయాలని వర్మ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ బయోపిక్ పై ఇప్పటివరకు నందమూరి హీరోలు కామెంట్ చేయలేదు. తాజాగా బాలకృష్ణ ఈ బయోపిక్ పై స్పందిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్యని.. ఎన్టీఆర్ బయోపిక్ ని ముందు వర్మతో అనుకొని ఆ తరువాత ఆయన్ను కాదన్నందుకే ఈ సినిమాకి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తీస్తున్నారని అంటున్నారు..? దానికి మీరేం అంటారని బాలయ్యని ప్రశ్నించగా.. నవ్వుతూ.. వర్మ ఏం కథ తీస్తున్నారో, ఏ కోణంలో తీస్తున్నారో.. నాకు తెలియదని అన్నారు. ఏ సినిమా తీయాలనేది ఆయన ఇష్టమని, అది ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. వర్మ తమ అనుమతి తీసుకోలేదని, ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం అందరి అనుమతి తీసుకొని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాంతో పాటు ఈ సినిమాలపై తన రియాక్షన్ కంటే జనం రియాక్షన్ ముఖ్యమని తెలిపారు.