గద్వాల్ లో చెడ్డి గ్యాంగ్...

SMTV Desk 2019-01-06 13:04:51  Hyderabad, Cheddi gang, Thiefs, Gadwal, KPHB

గద్వాల్, జనవరి 6: సంక్రాంతి పండగ సందర్భంగా దోచుకోవడానికి ఇదే అనువైన సమయంగా భావించి మరోసారు నగరంలోకి చెడ్డి గ్యాంగ్ చొరబడింది. కేపీహెచ్‌బీ లిమిట్స్‌లోని మూడు కాలనీల్లో చెడ్డి గ్యాంగ్ దొంగతనానికి ప్రయత్నించిన సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయిన దృశ్యాలను పోలీసులు చూపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుండగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది.

అర్థరాత్రి దాటిన తరువాత చెడ్డీ గ్యాంగ్ గద్వాల పట్టణంలో ప్రవేశించింది. స్థానిక వేణు అపార్ట్‌మెంట్లోకి ఉదయం రెండు గంటలకు ప్రవేశించారు. వాళ్లు ముఖాలు కన్పించకుండా మంకీ క్యాపులు పెట్టుకుని, చెడ్డీలు వేసుకుని అపార్ట్‌మెంట్లోకి చొరబడటం సీసీటీవీల్లో రికార్డ్ అయింది. అపార్ట్‌మెంట్లోని అన్నీ ఫ్లాట్లలో తిరిగి చూశారు. తలుపులు కొట్టారు. వాళ్లు తలుపులు తీయకపోవడం, కొన్ని ఫ్లాట్లకు తాళాలు వేసివుండటంతో అక్కడినుంచి చల్లగా జారుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నారు.