కౌరవులు టెస్ట్‌ట్యూబ్ పిల్లలే...???

SMTV Desk 2019-01-06 12:37:22  G Nageshwar rao, Andhra university vise chanceller, Kouravas, Test tube babys

హైదరాబాద్, జనవరి 6: కౌరవులపై సైన్స్ భోధకులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతంలోని వంద మంది కౌరవులందూ టెస్ట్‌ట్యూబ్‌ విధానంలో కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన పిల్లలే అని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జి.నాగేశ్వరరావు నొక్కి చెప్పారు. భారత సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. ఆయన చెప్పినదానికి ఏంటి ఆధారాలు అని హేతువాదులు ప్రశ్నిస్తుండగా, భారతమే ఆధారం అంటున్నా సంప్రదాయవాదులు.

శుక్రవారం జలంధర్‌లో సైన్స్ కాంగ్రెస్ లో నాగేశ్వరరావు మాట్లాడారు. గాంధారి టెస్ట్ ట్యూబ్ విధానంలో పిల్లలను కనిందని, వెయ్యేళ్ల కిందట మన దేశంలో మూలకణ టెక్నాలజీ ఉందని అన్నారు. ఆవిడ తన వంద అండాలను వంద కుండల్లో ఉంచి ఫలదీకరించిన తర్వాత కౌరవ సంతతి పుట్టకొట్టింది. అంతేకాకుండా వేలాది ఏళ్ల క్రితం నుంచే గైడెడ్‌ క్షిపణుల గురించిన పరిజ్ఞానం భారత్‌కు బాగా తెలుసని పేర్కొన్నారు. ‘విష్ణువు శత్రువులను చంపడానికి సుదర్శనచక్రం వాడాడు. అది పని అయిపోయాక మళ్లీ అతని వద్దకు వచ్చేది. ఇది గైడెడ్‌ క్షిపణి పరిజ్ఞానమే.