నగరంలో ఆటోలకు 'క్యూఆర్‌ కోడ్‌'

SMTV Desk 2019-01-05 19:14:48  Hyderabad, Share auto, Hyderabad traffic police, QR Code

హైదరాబాద్, జనవరి 5: మహిళల భద్రతా కోసం నగర పోలీసు శాఖ మరో కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు, అభద్రతా భావం తలెత్తకుండా పకడ్బందీ చర్యలకు తీసుకునున్నారు. ఆటో నెంబర్‌తో సహ డ్రైవర్‌ వివరాలను ట్రాఫిక్‌ పోలీసు కార్యాలయంతో అనుసంధానించి వారికి ఓ క్యూఆర్‌ కోడ్‌ను కేటాయిస్తారు. దీంతో ప్రయాణికుల భద్రతతోపాటు రోడ్డు ప్రమాదాలు.. అక్రమ పార్కింగ్‌లు.. బస్టాపుల్లో తిష్ఠవేసే ఆటోలు…కొంతమంది డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్డ పడనుంది. ఈనెల 17 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభం యజమానులు, డ్రైవర్లు సహకరించాలని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.